ఈ వారాంతంలో ఒమన్ ఆకాశంలో జెమినిడ్ ఉల్కాపాతం..!!
- December 10, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఆకాశంలో డిసెంబర్ 13 రాత్రి -డిసెంబర్ 14 ఉదయం జెమినిడ్ ఉల్కాపాతాన్ని చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సభ్యుడు ర్యాన్ బింట్ సయీద్ అల్ రువైష్ది వెల్లడించారు. 2020లో ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జెమినిడ్ కేవలం 6 గంటల్లో 1,063 ఉల్కలను నమోదు చేసింది. జెమినిడ్ ఉల్కాపాతం గ్రహశకలం 3200 ఫేథాన్ కారణంగా చోటుచేసుకుంది. 1983లో ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రోనామికల్ శాటిలైట్ (IRAS) ద్వారా గుర్తించారు. ఫేథాన్ శిధిలాల మార్గం గుండా భూమి వెళుతున్నప్పుడు, ఈ కణాలు మన వాతావరణంలో వచ్చి మండిపోతాయి. వాటిని ఉల్కలు అని పిలుస్తారు. సాధారణంగా ఈ ఉల్కలు నెమ్మదిగా కదులుతాయి. ఉల్కలలోని వివిధ మూలకాల కారణంగా అవి మండే సమయంలో పసుపు, ఆకుపచ్చ, నీలంతో సహా అనేక రకాల రంగులను ప్రదర్శిస్తాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి