భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించిన ఎమిరేట్స్ డ్రా..!!

- December 10, 2024 , by Maagulf
భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించిన ఎమిరేట్స్ డ్రా..!!

యూఏఈ: యూఏఈలో తన కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత ఎమిరేట్స్ డ్రా విస్తరణ వ్యూహం ప్రణాళికలను ప్రకటించింది. కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) ఇటీవలి నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. యూఏఈలో తమ కార్యకలాపాలను పాజ్ చేసామని, అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలలో తమ కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమిరేట్స్ డ్రా ప్రకటించింది. టైచెరోస్ కింద పని చేస్తున్న ఎమిరేట్ డ్రా, 'లిటిల్ డ్రా' పేరుతో లాటరీని కూడా నిర్వహిస్తుంది. ప్రతి టిక్కెట్ మూడు వేర్వేరు డ్రాలకు అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ $272,257 వరకు బహుమతులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.  

ఎమిరేట్స్ డ్రా గ్లోబల్ ఎంటిటీగా మారింది. “మేము ఇప్పుడు ప్రత్యేకంగా డిజిటల్ స్పేస్‌లో పనిచేస్తున్నాము. మా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు అందిస్తున్నాము. అయితే, యూఏఈ నివాసితులు ఇకపై ఎమిరేట్స్ డ్రా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేరు. డ్రాలలో పాల్గొనలేరు. యూఏఈలో ఫిజికల్ టిక్కెట్లు కూడా అందుబాటులో ఉండవు” అని ఎమిరేట్స్ డ్రా ప్రతినిధి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com