కాలిపోర్నియాలోని ఈస్ట్‌వేల్‌లో NATS 5కే వాక్‌ధాన్
- December 10, 2024
అమెరికా: అమెరికాలో తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది.ఈ క్రమంలోనే తాజాగా కాలిపోర్నియాలోని ఈస్ట్‌వేల్‌లో 5కే వాక్‌ధాన్ నిర్వహించింది.లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌లో దాదాపు 200 మందికి పైగా తెలుగు వారు పాల్గొని దీనిని విజయవంతం చేశారు. ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా స్మారకార్థం నిర్వహించిన ఈ వాక్‌థాన్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. రతన్ టాటాలోని సేవాగుణాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు తెలిపారు. రతన్ టాటా సాధించిన విజయాలు, చేసిన సేవ కార్యక్రమాలను నాట్స్ నాయకులు అందరికి గుర్తు చేశారు.ఈ వాక్‌థాన్‌కు సహకరించిన నాట్స్ బోర్డు సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్, మెంటర్లు హరి కొంక, వెంకట్ ఆలపాటిలకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్‌ధాన్‌కు శ్రీనివాస్ మునగాల, రాధా తెలగం, అరుణ బోయినేని, సిద్ధార్థ్ కోలా, శంకర్ సింగంశెట్టి తదితరులు ముఖ్య సహకారం అందించారు. కో-ఛైర్‌లు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి, శ్రీరామ్ వల్లూరి, సతీష్ యలవర్తి, అచ్చయ్య కెల్లంపల్లి, శ్యామల చెరువు, లత మునగాల తదితరుల కృషితో పాటు వాలంటీర్ల సహకారంతో ఈ వాక్‌ధాన్ విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వాక్‌ధాన్‌కు లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (లత) మద్దతునిచ్చింది, లత సంస్థ ప్రతినిధులు చక్రి కావూరి, శ్రీనివాస్ యార్లగడ్డ, సుధీర్ పొత్తూరి, సూర్య దామోదర, హరి కలవకూరి ఈశ్వర్ అరిగేలు తమ సహకారంతో వాక్‌ధాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి