కువైట్ లో ఇంజనీర్లకు కొత్త గైడ్ లైన్స్..!!
- December 30, 2024
కువైట్: ఇంజినీరింగ్ వృత్తులలో వర్క్ పర్మిట్ను పొందేందుకు లేదా పునరుద్ధరించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అథారిటీ డైరెక్టర్ మర్జౌక్ అల్-ఒటైబి ప్రకారం.. PAM ఎలక్ట్రానిక్ పోర్టల్ల ద్వారా ముందుగా ఇంజనీరింగ్ అర్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లతో దరఖాస్తును సమర్పించాలి. ఇది వర్క్ పర్మిట్ కోసం తప్పనిసరి. కువైట్ ప్రభుత్వ లేదా ఇంజినీరింగ్, ఇంజనీరింగ్ సైన్సెస్ లేదా ఆర్కిటెక్చర్ ప్రైవేట్ యూనివర్సిటీలు, లేదా గుర్తింపు పొందిన కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేయాలి. కువైట్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నుండి వారి అర్హతలను నిర్ధారించుకోవాలి.
సెప్టెంబరు 8, 2024 నాటికి PAM సిస్టమ్లలో నమోదు చేసుకున్న ఇంజనీర్లు, వారి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. వర్క్ పర్మిట్లపై కువైట్లోకి ప్రవేశించే ఇంజనీర్లు తప్పనిసరిగా సంబంధిత కమిటీ నుండి గుర్తింపు పొందాలి. ఇది రెండు సంవత్సరాల పాటు తాత్కాలిక రిజిస్ట్రేషన్ గా పనిచేస్తుంది. కాగా, గుర్తింపు పొందని వారు ఇతర వృత్తులకు బదిలీ చేసుకోవచ్చు. అనంతరం ఇంజనీరింగ్ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ రంగానికి బదిలీ అయ్యే ప్రభుత్వ రంగ ఉద్యోగులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ వృత్తిలో ముందస్తు రిజిస్ట్రేషన్ను నిర్ధారించడానికి సివిల్ సర్వీస్ బ్యూరో నుండి జారీ అయిన ఒరిజినల్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







