ప్రపంచంలోని తొలిసారి సౌదీలో ‘రోబోటిక్’తో ఆర్టిఫిషియల్ హార్ట్ ఇంప్లాంటేషన్..!!
- January 18, 2025
రియాద్: రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (KFSHRC) అబాట్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోటిక్-సహాయక ఆర్టిఫిషియల్ హార్ట్ పంపు (హార్ట్‌మేట్ 3) ఇంప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. హార్ట్‌మేట్ 3 ఎల్‌విఎడి (ఎడమ జఠరిక సహాయక పరికరం)ను డాక్టర్లు అమర్చారు.ఇది ఎడమ జఠరిక అని పిలువబడే దిగువ ఎడమ గుండె గది నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడంలో సహాయపడుతుంది. ఒక కంట్రోలర్ యూనిట్, బ్యాటరీ ప్యాక్ ను పేషంట్ బాడీ వెలుపల ధరించాల్సి ఉంటుంది. దీనిని చర్మంలో చిన్న రంధ్రం ద్వారా LVADకి కనెక్ట్ చేస్తారు. గుండె వైఫల్యం కారణంగా 120 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. హాస్పిటల్ రోబోటిక్స్ అండ్ మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ప్రోగ్రామ్ డైరెక్టర్, కార్డియాక్ సర్జరీ హెడ్ డా. ఫెరాస్ ఖలీల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ తరహా హార్ట్ ఇంప్లాంటేషన్ ప్రపంచంలోని మొట్టమొదటిదని డాక్టర్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు KFSHRC కేంద్రంగా ఉంటుందని, ఈ ఆపరేషన్ ప్రత్యేక ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ లీడర్‌గా తన హోదాను మరింత సుస్థిరం చేసిందన్నారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







