ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- January 19, 2025
హైదరాబాద్: సినిమాలలో గొప్పగా నటించగల ఎన్టీఆర్ నిజ జీవితంలో నటించటం చేతకాని వున్నత వ్యక్తి అని ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపకురాలు డాక్టర్ లక్ష్మీ పార్వతి అన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) నిర్వహణలో విఖ్యాత నటుడు పూర్వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డ్ ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామ కృష్ణ కు ప్రదానోత్సవం జరిగింది ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ లక్ష్మీ పార్వతి పాల్గొని అవార్డు బహుకరించి మాట్లాడుతూ...ఎన్టీఆర్ తాను అవగాహనతో వైవాహిక జీవితం గడిపిన బయట శక్తుల వల్ల కాల పరీక్ష కి లొంగి పోవాల్సి వచ్చింది అన్నారు. వంశీ రామరాజు తనకు సన్మానం చేసిన సందర్భం జీవితంలో మరువలేనిది అని చెప్పారు.రామకృష్ణ గానంలో మాధుర్యం వుందని అభినందించారు.అధ్యక్షత వహించిన వంశీ రామరాజు మాట్లాడుతూ... కళా సంస్థలకు రాజకీయాలతో సంబంధ ము వుండదు అన్నారు రామ కృష్ణ విదేశాలలో తమ అనాథ బాలల సంస్థ కోసం పలు కార్యక్రమాలలో పాటలు పాడారు అని చెప్పారు.వేదిక పై నటుడు శంకర్ డాక్టర్ తెన్నేటి సుధ శైలజ, సుధమయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ కృష్ణ సహా గాయకులతో కలసి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







