సీలైన్లో మోటర్‌హోమ్ బీచ్ ప్రారంభం..!!
- January 19, 2025
దోహా, ఖతార్: సీలైన్ ప్రాంతంలో మోటర్‌హోమ్ యజమానులకు అంకితం చేయబడిన కొత్త బీచ్‌ను సాఫ్ట్‌గా ప్రారంభిస్తున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MOECC) ప్రకటించింది. పర్యావరణ పర్యాటకానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీరు, మురుగునీరు, లైటింగ్ సేవలను ఏర్పాటు చేశారు. బీచ్ ప్రతి మోటర్‌హోమ్ యజమానికి రెండు రాత్రులు మాత్రమే ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. ఖతార్‌లోని మోటార్హోమ్ యజమానులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరుల కోసం ఎంటర్ టైన్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభించబడుతోంది. MOECCలోని నేచురల్ రిజర్వ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సలేహ్ అల్ కువారి మాట్లాడుతూ.. సీలైన్ ప్రాంతంలోని కొత్త బీచ్ దేశంలోని వినోద మౌలిక సదుపాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. "మోటార్ హోమ్" పార్కింగ్ లొకేషన్ల సమీపంలో నియమించబడిన సీటింగ్ ప్రాంతాలు, సౌకర్యవంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించవచ్చు.’’ అని పేర్కొన్నారు. పర్యావరణ-పర్యాటకానికి మద్దతు ఇవ్వడం కోసం, భవిష్యత్తులో అదనపు బీచ్ లను విస్తరించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని అల్ కువారి తెలిపారు.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







