సౌదీలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అరెస్టు..!!
- February 10, 2025
రియాద్: అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల నుండి మూడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు.అరెస్టయిన 19 మందిలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అధికారుల కథనం ప్రకారం.. అరెస్టు చేయబడిన ముఠా సభ్యులను అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు.అరెస్టయిన వారిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు, జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీకి చెందిన ఏడుగురు ఉన్నారు. నిందితులు అసిర్, జజాన్, తూర్పు ప్రావిన్స్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్, ట్రాఫికింగ్ కు సంబంధించిన మూడు క్రిమినల్ నెట్వర్క్ లను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







