విఖ్యాత దర్శకుడు విశ్వనాథ్ కు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించాలి

- March 07, 2025 , by Maagulf
విఖ్యాత దర్శకుడు విశ్వనాథ్ కు  పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించాలి

హైదరాబాద్: భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి తన చిత్రాల తో చాటిన డాక్టర్ కె. విశ్వనాథ్ కు కేంద్ర ప్రభుత్వం అయన నేడు లేనప్పటికీ మరణాంతర పద్మ విభూషణ్ ప్రకటించాలని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు కోరారు.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన వారు పద్మ భూషణ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారనీ రామ రాజు గుర్తు చేశారు. త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదిక వంశీ ఇంటర్నేషనల్(,ఇండియా) సమర్పణ లో ప్రముఖ గాయకుడు కొండూరి రవి నిర్వహణలో విశ్వనాథామృతం శీర్షికన విశ్వనాథ్ సినిమాల లోని పాటలను రవి తో పాటు యోగిత,ఇందు నయన, హరిణి భార్గవి లలితా శ్రీనివాస్ మూర్తి మృదు మధుర గానం చేశారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీ రామరాజు గాయకులను సత్కరించి మాట్లాడారు.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలు ఇంటిల్లి పాదీ కలసి చూసే విధంగా గౌరవ ప్రదంగా ఉంటాయన్నారు. నిర్వాహకుడు రవి తల్లి స్మరణలో మంచి పాటలు ఎంచుకొని కార్యక్రమం నిర్వహించటం అభినందనీయం అన్నారు సుధా మయి వ్యాఖ్యానం చేయగా సుంకరపల్లి శైలజ కార్యక్రమ పర్యవేక్షణ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com