పెళ్లైనా కూడా హాట్ గా రెచ్చిపోతుంది!
- May 02, 2018బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చారు. కరీనా కపూర్ హాట్ బ్యూటీగా బాలీవుడ్ లో పలు సంచలనాలు సృష్టించింది. అంతే కాదు అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న సయిఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లై ఓ బాబు పుట్టిన తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
హీరోలకి లక్కి హీరోయిన్ ప్లాప్‌లలో ఉన్న హీరోలకి హిట్ ఇచ్చిన క్వీన్.100 కోట్ల మార్కెట్ హీరోయిన్గా కరీనాకు పేరుంది .సల్మాన్,అమీర్ ఖాన్ ఇలా స్టార్ హీరోలకి సక్సెస్ ఇచ్చింది. ఓ బాబు పుట్టిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు 'వీరే ది వెడ్డింగ్' అభిమానుల ముందుకు రాబోతుంది. నలుగురు ఫ్రెండ్స్ మధ్యనున్న రిలేషన్షిప్ ఆధారంగా బాలీవుడ్లో రానున్న మూవీ 'వీరే ది వెడ్డింగ్'.రీసెంట్గా వచ్చిన ట్రైలర్‌కి మాంచి స్పందనరావడంతో ప్రమోషన్ కోసం రెడీ చేసిన సాంగ్‌ని రిలీజ్ చేసింది యూనిట్.
తాజాగా రిలీజ్ అయిన ఓ సాంగ్ లో కరీనా రెచ్చిపోయి మరీ నటించింది. అసలు పెళ్లై ఓ పిల్లాడికి తల్లేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జీరో సైజ్ తో కరీనా తన అందాలు సోయగాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఓ బాబు పుట్టిన తర్వాత కరీనా చేస్తున్న మూవీ కాగా, మ్యారేజ్‌కి ముందు సోనమ్ నటించిన ప్రాజెక్ట్ ఇది.వచ్చేనెల ఒకటిన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్‌లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్‌లో భారతీయ బైకర్‌కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!