మాగల్ఫ్.కామ్ గురించి
తెలుగు భాష, సంస్కృతులపట్ల ఉన్న ప్రేమతో; గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు కవులను, కథారచయితలను, వ్యాపారులను ఒక ఆన్లైన్ వేదిక మీదకు తీసుకువచ్చే లాభాపేక్షలేని ఉద్దేశ్యంతో ఈ మాగల్ఫ్.కామ్ స్థాపించబడింది. ఆలోచన ఎవరిది అయినా, మీ వంటి సహృదయుల సహాయ సహాకారాలు లేకుండా ఇంతటి బృహత్ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడం అసాధ్యం. ఇది పూర్తిగా తెలుగులో ప్రచురితమయ్యే అంతర్జాల పత్రిక.
క్లుప్తంగా మాగల్ఫ్.కామ్ లక్ష్యాలు:
- గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారి సృజనాత్మకతకు వేదిక చూపించడం.
- ఉగాది, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా కవితా, కథా పోటీలు నిర్వహించడం; గెలుపొందినవారికి ప్రోత్సాహకాలు అందించడం.
- తెలుగు వారు నడుపుతున్న హోటళ్లు, ట్రావెల్ సర్వీసులు మొదలైన విషయాల సమగ్ర సమాచారాన్ని పొందుపరచడం.
- ప్రపంచ నలుమూలల నుంచి పర్యటనకోసం మరియు ఉద్యోగ వ్యాపారాల కోసం వచ్చే తెలుగు వారికి మాగల్ఫ్.కామ్ ను ఒక దిక్సూచిగా తీర్చి దిద్దడం.
- గల్ఫ్ లో జరిగే తెలుగు కార్యక్రమాల, విడుదలైన తెలుగు సినిమాల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం.
- గల్ఫ్ లో తెలుగు వారికి సంబంధించిన/ ఉపయోగకరమైన తాజా వార్తలను ఏ రోజుకారోజు అప్డేట్ చేయడం.
- గల్ఫ్ లో ఉన్న తెలుగు వారికోసం హెల్ప్ లైన్ మాదిరిగా కొందరి నంబర్లు చేర్చడం.
- గల్ఫ్ లోని వివిధ తెలుగు సంస్థలన్నిటికీ అనుసంధానం కావడం.