మార్చి 28న తప్పకుండా సినిమా చూడండి: హీరో నితిన్
- March 16, 2025
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలోని SRKR ఇంజనీరింగ్ కాలేజ్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.
గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ..హాయ్ SRKR. మార్చి 28న అందరికీ హాలీడే ఇవ్వాలని కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను(నవ్వుతూ). లేదంటే అందరూ మాస్ బంక్ కొట్టండి. మీ ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇది మా రవి గారు చదువుకున్న కాలేజ్. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా వుంది. అందరూ రాబిన్ వుడ్ సినిమా చూడండి. మిమ్మల్ని డిస్సాపాయింట్ చేయదు. అందరికీ ఆల్ ది బెస్ట్'అన్నారు
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. మార్చి 28న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చదువుకునే సమయంలో మంచి బ్రేక్ కోసం చూసే సినిమా ఇది. అందరికీ థాంక్ యూ'అన్నారు
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. మా సినిమా నుంచి వేర్ ఎవర్ యు గో, వన్ మోర్ టైం, అది దా సర్ ప్రైజ్ మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు పాటల్లానే ప్రతి కాలేజ్ లో మూడు రకాల స్టూడెంట్స్ వుంటారు. ఒకళ్ళు బాగా చదివి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అన్నట్లుగా జాబ్స్ కొట్టేశారు. రెండో క్యాటగిరీ వన్ మోర్ టైం అంటూ బ్యాక్ లాగ్స్ రాస్తుంటారు. రవి గారు లాగా మూడో క్యాటగిరీ. ఆయన ఇంజనీరింగ్ చదివి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఏది చేసిన హార్ట్ ఫుల్ గా చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. రాబిన్ వుడ్ కూడా హార్ట్ ఫుల్ గా చేశాం. సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థాంక్ యు'అన్నారు.
ప్రొడ్యూసర్ వై రవి శంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ కాలేజ్ ప్రోడక్ట్ ని అని చెప్పులోవడం చాలా ఆనందంగా వుంటుంది. నా క్లాస్ మేట్స్, టీచర్స్ అందరికీ థాంక్ యూ. రాబిన్ వుడ్ సినిమా అద్భుతంగా వచ్చింది. మార్చి 28న సినిమాకి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది. నితిన్ గారికి, శ్రీలీల గారికి, డైరెక్టర్ వెంకీకి థాంక్ యూ'అన్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









