ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్..
- April 03, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు అనేక దేశాలపై సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశంపై 26 శాతం సుంకాలు విధించారు. దీంతో మన మనదేశలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాగే, పలు వస్తువుల ధరలు తగ్గుతాయి.
మనదేశం నుంచి అమెరికాకు అధికంగా పసిడి, వెండి, వజ్రాలు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ ఇప్పుడు ఈ రంగంపై 13.32 % టారిఫ్ విధిస్తున్నారు. దీంతో దేశంలో నగలతో పాటు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి.
ఇదే సమయంలో అమెరికాలో వీటి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అమెరికాకు భారత్ నుంచి వీటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఆయా రంగాల చేతివృత్తిదారులతో పాటు వ్యాపారులపై పడే అవకాశం ఉంది.
అమెరికాకు భారత్ మొబైల్‌తో పాటు టెలికాం, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కూడా ఎగుమతి చేస్తుంది. వాటిపై ట్రంప్ 7.24 % టారిఫ్ విధించారు. ఈ కారణంతో అక్కడ ఐఫోన్ సహా పలు మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతాయి. మన దేశంలోనూ అనేక స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతాయి.
అమెరికాకు భారత్ నుంచి కోట్లాది రూపాయల వస్త్రాలు ఎగుమతి అవుతాయి. వీటిపై ట్రంప్ భారీగా ట్యాక్స్ విధిస్తున్నారు. పరస్పర టారిఫ్‌లతో అమెరికాలో వాటి ధరలు తగ్గుతాయి.
అమెరికాకు భారత్ నుంచి కొన్ని కోట్ల రూపాయల సముద్ర ఆహారం ఎగుమతి అవుతుంది. దీనిపై కూడా ట్రంప్ 27.83 % టారిఫ్ అమలు చేసే అవకాశం ఉంది. దీంతో యూఎస్‌లో రొయ్యల ధర పెరుగుతుంది. భారత్ నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో మన దేశంలో రొయ్యల ధరలు తగ్గుతాయి. అయితే, రొయ్యల వ్యాపారంలో ఉన్న వారి ఆదాయం తగ్గుతుంది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పంచదార, ప్రాసెస్ చేసిన ఫుడ్, కోకోపై అమెరికాలో 24.99 % టారిఫ్ వేసే ఛాన్స్ ఉంది. యూఎస్‌లో మన దేశ మిఠాయిలు, తినుభండారాల ధరలు పెరుగుతాయి. అలాగే, నెయ్యితో పాటు పాల పొడి, వెన్న ధరలు భారత్‌లో తగ్గుతాయి.
అమెరికాలో వంట నూనె సెక్టార్‌పై 10.67 % టారిఫ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ రంగంలోని రైతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దేశంలో ఆవాలతో పాటు కొబ్బరి రేట్ తగ్గుతుంది. మరోవైపు, మన దేశంలో బాదంతో పాటు వాల్ నట్స్ వంటి వాటి రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







