'అర్జున్ S/O వైజయంతి' ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ రిలీజ్
- April 03, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ 'నాయల్ది' చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. మూవీ టీం దూకుడుగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి రాబోయే వేసవి సెలవుల అడ్వాంటేజ్ కానున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్నారు. తన ఇంటెన్స్ ప్రజెన్స్ సినిమాలోని క్యారెక్టర్ పవర్ ఫుల్ వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.
ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది, కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా.
రిలీజ్ డేట్ ని లాక్ చేయడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మరింత ముమ్మరం చేయనున్నారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
DOP: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







