'సినిమా రివ్యూ: ‘JACK’
- April 10, 2025
‘టిల్ల’, టిల్లు స్క్వేర్’ సినిమాలతో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ. తనదైన ప్రత్యేకమైన ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేశాడు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ చేసిన సినిమానే ‘జాక్’. రా బ్యాక్ డ్రాప్లో ఫన్నీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా వుందో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
జాక్ (సిద్దూ జొన్నలగడ్డ) చిన్నప్పట్నుంచీ చదువుల్లో టాపర్‌గా వుంటాడు. ఏదో వచ్చిన టైమ్ పాస్ వుద్యెోగం చేయడం ఇష్టముండదు జాక్కి. తనకున్న టాలెంట్‌తో రా ఏజెంట్‌గా రాణించాలనుకుంటాడు. ‘రా (RAW) ఏజెంట్‌గా పని చేసి దేశానికి సేవ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. రిజల్ట్ రాకుండానే ఓ మిషన్‌పై వర్క్ చేయాల్సి వస్తుంది జాక్. ఎంతో అనుభవం వున్న రా ఏజెంట్లతో కలిసి జాక్ వర్క్ చేయాల్సి వస్తుంది ఈ మిషన్‌లో. టెర్రరిస్టుల్ని పట్టుకునే ఈ స్పెషల్ మిషన్‌లో జాక్ తన తిక్కలతో సీనియర్ రా ఏజెంట్లకు ఎలాంటి చుక్కలు చూపించాడు.? అసలు ఈ మిషన్ సక్సెస్ అయ్యిందా.? తెలియాలంటే ‘జాక్’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
సిద్దూ జొన్నలగడ్డ ఎప్పటిలాగే తనదైన ఆటిట్యూడ్‌తో ఈజీగా నటించేశాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో అక్కడక్కడా నవ్వులు కూడా పూయించాడు. ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవీ చైతన్యకు ఇది ముచ్చటగా మూడో సినిమా. తొలి సినిమాలో వున్నంత ఇంటెన్స్ రెండో సినిమాకే లేకపోయింది. ఇక, మూడో సినిమా ‘జాక్’లో ఆమె పాత్రకు అస్సలు ఇంపార్టెన్స్ లేదనే చెప్పాలి. ఈవెన్ హీరోతో రొమాంటిక్ సన్నివేశాలు కూడా సరిగ్గా పండలేదు. పక్కా బోరింగ్ క్యారెక్టర్ అయిపోయింది పాపం వైష్ణవికి ఈ సినిమాలో. ఇక, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితర సీనియర్ నటులు ఫస్టాఫ్‌లో ొ ఒకటి రెండు చోట్ల తమ అనుభవాన్ని చూపించారు. కానీ, అవేమాత్రం సినిమాకి వర్కవుట్ కాలేదు. ఏ పాత్రలోనూ బలమైన చిత్రీకరణ కనబడలేదు. ప్రధాన పాత్రల్లోనే పస లేదు. ఇక, మిగిలిని నటీనటుల పాత్రలు అలా వస్తూ పోతుంటాయంతే.!
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అనగానే అందరికీ ఓ ఐడియా వుంటుంది. కానీ, ఆ స్థాయి ‘జాక్’లో ఇంచుకైనా కనిపించదు. కథ కానీ, కథనం కానీ ఎక్కడా బొమ్మరిల్లు భాస్కర్ స్టైలింగ్‌లో నడిచినట్లు అనిపించదు. స్పై సన్నివేశాలు, రా ఏజెంట్ల సీక్రెట్ మిషన్ ఆపరేషన్స్ అన్నీ సిల్లీగా అనిపిస్తాయ్. ఎక్కడా లాజిక్స్ కాదు కదా.. అస్సలు మ్యాజిక్ సన్నివేశాలే కనిపించవ్. నిజానికి ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, మదర్ సెంటిమెంట్, లవ్, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్లకూ చోటుంది. కానీ, ఎక్కడా ఆ ఎమోషన్లు పండిన దాఖలాల్లేవ్. ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పని చేశారు. కానీ, అంత ఎఫెక్ట్ లేదు. బీజీఎమ్ ఓకే. కానీ, పాటలు బోరింగ్‌గా అనిపిస్తాయ్. ఒక్క పాట కూడా గుర్తు పెట్టుకునేలా వుండదు. సినిమాటోగ్రఫీ సినిమాకి అస్సలు సెట్ కాలేదని చెప్పొచ్చు. ఎడిటింగ్‌పై చాలానే ఫోకస్ పెట్టుండాల్సింది. రెండు గంటల పదిహేను నిమిషాల సినిమాని ఇంకా తక్కువకి కుదించేసినా పెద్దగా ఫరక్ పడేది కాదనిపిస్తుంది. నిర్మాణ పరంగానూ బాగా లోభించినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ మరీ చీప్‌గా లాగించేశారు.
ప్లస్ పాయింట్స్:
వన్ అండ్ ఓన్లీ సిద్దూ పర్ఫామెన్స్..
మైనస్ పాయింట్స్:
చాలానే వున్నాయ్. లెక్కపెట్టడానికి వేళ్లూ చాలవు. కంప్లీట్‌గా యూత్ మూవీలా అయినా తీసుండాల్సింది. లేదంటే లవ్ అండ్ రొమాంటిక్ కాన్సెప్ట్ అయినా టచ్ చేసుండదాల్సింది. లేదంటే, కంప్లీట్ సీరియస్ స్పై కాన్సెప్ట్ అయినా. ఎందులోనూ క్లారిటీ లేకుండా కలగా బులగం చేసేసి, కన్ఫ్యూజ్ చేసేస్తారు. బోర్ కొట్టించేస్తారు.
చివరిగా:
గతంలోనూ కొన్ని స్పై కాన్సెప్ట్ మూవీస్ వచ్చాయ్. అవన్నీ దాదాపు ఫెయిల్యూర్ లిస్టులోనే చేరిపోయాయ్. మరి మన ఆటిట్యూడ్ స్టార్ సిద్దూ జొన్నలగడ్డ.. తన ఆటిట్యూడ్‌తో ఈ స్సై సినిమాని ఆదుకోగలడా.? కూసింత కష్టమే సుమీ.!
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్‌లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్‌లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ