అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల 10 జాబితా విడుదల
- April 14, 2025
విమానయాన రంగంలో కొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి.కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత, ప్రయాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక రద్దీ గల విమానాశ్రయాల జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఇందులో ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం.అమెరికాలోని హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం (ATL) మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2024లో 108.1 మిలియన్ల ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలందించింది. 2023తో పోలిస్తే ఇది 3.3 శాతం అధికం అయినా, కోవిడ్ ముందు స్థాయితో పోలిస్తే మాత్రం ఇంకా 2 శాతం తక్కువగానే ఉంది.
దుబాయ్ రెండో స్థానంలో ఆసియా నుంచి హనేడా నాలుగో స్థానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) వరుసగా రెండోసారి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. 92.3 మిలియన్ల ప్రయాణికులతో 6.1 శాతం వృద్ధిని సాధించింది.యూరప్, ఆసియా, ఆఫ్రికాల మధ్య ఉన్న మెరుగైన కనెక్టివిటీ దీనికి ప్రధాన కారణం. ఆసియాలో అత్యధిక రద్దీ గల టోక్యో హనేడా ఎయిర్పోర్ట్ (HND) 85.9 మిలియన్ల ప్రయాణికులతో నాలుగో స్థానంలో నిలిచింది.డల్లాస్ ఫోర్ట్ వర్త్ (DFW) 87.8 మిలియన్ల ప్రయాణికులతో మూడో స్థానం దక్కించుకుంది. ఇది 2019 స్థాయిల కంటే 17 శాతం ఎక్కువ. లండన్ హీత్రో (LHR) ఐదవ స్థానంలో నిలిచింది. డెన్వర్ ఎయిర్పోర్ట్ (DEN) ఆరో స్థానంలో ఉండగా, ప్రయాణికుల సంఖ్య 82.4 మిలియన్లు.
ఇస్తాంబుల్, చికాగో తర్వాత ఢిల్లీకి 9వ స్థానం
టర్కీకి చెందిన ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ (IST) 80.1 మిలియన్ల ప్రయాణికులతో ఏడో స్థానంలో ఉంది. తర్వాతగా చికాగో ఓ’హేర్ (ORD) 80 మిలియన్ల ప్రయాణికులతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇవన్నీ 2019తో పోలిస్తే గణనీయమైన వృద్ధిని చూపుతున్నాయి.భారతదేశం నుంచి ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (DEL) తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 2024లో 77.8 మిలియన్ల ప్రయాణికులతో 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమానాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ మార్గాల విస్తరణ దీనికి సహాయంగా నిలిచాయి.ఇది దక్షిణాసియాలో ఓ ప్రధాన కేంద్రంగా మారుతోంది. చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయం (PVG) 2023లో 21వ స్థానంలో ఉండగా, 2024లో 76.8 మిలియన్ల ప్రయాణికులతో పదో స్థానానికి దూసుకొచ్చింది.ఏకంగా 41 శాతం వృద్ధిని నమోదు చేయడం నిజంగా అద్భుతం.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్‌కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్‌లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్‌లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!