‘డిజైన్ దోహా ప్రైజ్ 2026’ను ప్రారంభించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- April 21, 2025
దోహా: డిజైన్ దోహా ప్రైజ్ 2026 రెండవ ఎడిషన్ను ప్రారంభించినట్లు ఖతార్ మ్యూజియమ్స్ ప్రకటించింది. ఇది మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతంలో డిజైన్ రంగాలలో అసాధారణ ప్రతిభకు మద్దతు ఇచ్చే ప్రతిష్టాత్మక కార్యక్రమంగా గుర్తింపు పొందింది.
నాలుగు వేర్వేరు డిజైన్ విభాగాలలో ఎంపికైన నలుగురు డిజైనర్లను బహుమతులతో సత్కరిస్తారు. క్రాఫ్ట్, ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్ వంటి విభాగాల్లో ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమైంది. జూన్ 30లోపు అర్హులైన వారు దరఖాస్తులను సమర్పించాలని డిజైన్ దోహా యాక్టింగ్ డైరెక్టర్ ఫహద్ అల్ ఒబైద్లీ తెలిపారు. ప్రతి విజేతకు QR200,000 నగదు బహుమతితో పాటు మెంటర్షిప్ తోపాటు అనేక అవకాశాలను అందజేస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







