'డ్యూడ్' ఫస్ట్ లుక్ రిలీజ్
- May 11, 2025ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే'తో నటుడిగా అరంగేట్రం చేశారు, ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్ హిట్ 'డ్రాగన్' తో మ్యాసీవ్ పాపులరిటీ సాదించారు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళం-తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. 'ప్రేమలు' చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
ఈరోజు ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్ గా విడుదల చేశారు, అద్భుతమైన ఫస్ట్ లుక్‌ను రివిల్ చేయడంతో పాటు, విడుదల తేదీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. యూత్ ని ఆకట్టుకునే విధంగా 'డ్యూడ్' అనే టైటిల్ తో రూపొందిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్ ఇంటెన్స్ అవతార్ లో, ముఖం మీద గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకుని కనిపించారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూచించినట్లుగా, డ్యూడ్ మోడరన్ ట్విస్ట్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం 2025 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసింది. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో దీపావళికి సరైన ఎంటర్టైనర్ ను అందించడానికి టీం వేగంగా పని చేస్తోంది. డ్యూడ్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: బరత్ విక్రమన్
తమిళ PRO: సురేష్ చంద్ర, సతీష్
తెలుగు PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







