'23'కి రావాల్సిన ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది: డైరెక్టర్ రాజ్ ఆర్
- May 20, 2025
మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ లేటెస్ట్ మూవీ “23” తో మరో విజయాన్ని అందుకున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేసింది. మే 16న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులు విమర్శకుల ప్రసంశలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో డైరెక్టర్ రాజ్ ఆర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 23సినిమాకి రావలసిన సపోర్ట్, ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది. ఒక మూవీ సక్సెస్ కి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈ సినిమా ఛాలెంజింగ్ అని తెలుసు. ఇలాంటి సినిమాతో స్ఫూర్తి పొంది ఇలాంటి కథలు మరొకరు తీస్తారనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అందుకే ఇలాంటి ప్రయోగం చేశాం. సినిమాకి ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది. అదే మా సక్సెస్. ఒక డైరెక్టర్ గా నాకు అందరికంటే ఫేవరెట్ క్యారెక్టర్ తేజ చేసింది. మొత్తం తన భుజాల మీద మోసాడు. నేను తనని నమ్మాను. ఆ నమ్మకం నిలబెట్టాడు. అందరూ నటీనటులు చాలా అద్భుతంగా చేశారు. సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు
తన్మయి మాట్లాడుతూ.. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. తొలి సినిమాకే ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా అందరికీ నచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు సినిమాని ప్రశంసిస్తున్నారు. మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకి విజయాన్ని ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ చాలామంది అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్ గారికి థాంక్యూ'అన్నారు
తేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ.ఒక డెబ్యు యాక్టర్ కి ఇంత మంచి ఇంటెన్స్ స్టోరీ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్ గారికి థాంక్యూ. 10 ఏళ్ల తర్వాత చేయాల్సిన రోల్ ఇది. నాపై నమ్మకంతో ఆయన ఈ పాత్రను ఇచ్చారు. రాజుగారు నా జీవితానికి ఒక హోప్ ఇచ్చారు. నా జీవితంలో ఆయన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.ను ఈ సినిమాలో అందరూ కూడా అద్భుతంగా పెర్ఫాం చేశారు.ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఆర్గానిక్ గా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది'అన్నారు
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









