‘సర్దార్ 2’ నుంచి హీరో కార్తి పవర్ ఫుల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
- May 25, 2025
హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ రోజు హీరో కార్తి బర్త్డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కార్తి మ్యాసీవ్ మిషన్ గన్ పట్టుకొని రగ్గడ్ లుక్ లో కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. సినిమాలో కార్తి క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.
సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.
విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం: కార్తి, ఎస్ జె సూర్య, మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: పిఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎ వెంకటేష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
డీవోపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నంబియార్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పాండి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







