'థగ్ లైఫ్' నుంచి 'ఓ మార' సాంగ్ రిలీజ్
- May 28, 2025
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈరోజు, మేకర్స్ థర్డ్ సింగిల్ 'ఓ మార' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఎఆర్ రెహమాన్ కంపోజిషన్ మర్చిపోలేని రైడ్‌ను అందిస్తుంది. ట్యూన్ బీట్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శింబు బోల్డ్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తోంది.
ఆదిత్య ఆర్కే సాంగ్ ని పాడిన విధానం అదిరిపోయింది, రాకేందు మౌళి రాప్ సాంగ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. అనంత శ్రీరామ్ థగ్ లైఫ్ ప్రపంచం లాగానే ట్రెండీ, ఇంపాక్ట్ ఫుల్ లిరిక్స్ అందించారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్ ఎన్ సుధాకర్ రెడ్డి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







