'SYG' అప్పుడే 75% పూర్తి..
- May 29, 2025
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు (SYG) తో తన కెరీర్‌ను న్యూ హిట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రిట్టీ, ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ తో ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది .
నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, బ్లాక్‌బస్టర్ హనుమాన్ భారీ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
కంటెంట్, స్కేల్ రెండింటిలోనూ అత్యున్నత స్థాయిలో దూసుకుపోతున్న SYG ఇప్పుడు ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చేరుకుంది. ఈ చిత్రం 120 షూటింగ్ రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది, దాదాపు 75% షూట్ పూర్తయింది. ఈ సక్సెస్ ఫుల్ టీం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ ని రూపొందిస్తోంది.
ప్రస్తుతం, టీం మూడు భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు, ఇవి నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్‌కు కీలకమైన బ్యాక్ డ్రాప్స్ గా వుంటాయి. ఈ సెట్స్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, ఇవి సినిమాలో విజువల్స్ పరంగా అద్భుతంగా, కథనం పరంగా మోస్ట్ ఎక్సయిటింగ్ గా వుండబోతున్నాయి.
SYG లో సాయి దుర్గ తేజ్ కెరీర్ రీడిఫైన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర ఇప్పటివరకు అతని కెరీర్‌లో మోస్ట్ పవర్ ఫుల్, ఎమోషన్స్ పరంగా అద్భుతంగా వుండబోతోంది. ఇందులోక్యారెక్టర్ కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండటంతో ఈ పవర్ ఫుల్ గ్రిప్పింగ్ కథ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ప్రతిష్టాత్మక తారాగణం ఈ చిత్రానికి పని చేస్తుండగా, రాబోయే రోజుల్లో అఫీషియల్ గా నటీనటులని అనౌన్స్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచనున్నాయి.
భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ సినిమా, సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మైల్ స్టోన్ గా నిలవనుంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీకి వెట్రి పళనిసామి అందిస్తుండగా సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ సమకూరుస్తున్నారు, నవీన్ విజయ కృష్ణ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైన్ గాంధీ నడికుడికర్
ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రోహిత్ కె.పి
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
DOP: వెట్రి పళనిసామి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: నవీన్ విజయ కృష్ణ
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







