'స్వయంభు' నుంచి మ్యాసీవ్ ఎపిక్ పోస్టర్ రిలీజ్
- June 01, 2025
యూనిక్ స్టార్ నిఖిల్ 'కార్తికేయ 2' పాన్ ఇండియా స్థాయి విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా వెంచర్ 'స్వయంభు'తో వస్తున్నాడు, ఇది అతని 20వ మైల్ స్టోన్ మూవీ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్-స్కేల్ హిస్టారిక్ యాక్షన్ ఎపిక్ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో వుంది. ఈ చిత్రంలో నిఖిల్ మునుపెన్నడూ చూడని అవతార్ లో ఒక లెజెండరీ యోధునిగా కనిపిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాన్-ఇండియా విజన్ తో రూపొందిస్తున్నారు.
స్వయంభు టీం నిఖిల్ పుట్టినరోజున పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. నిఖిల్, సంయుక్త యుద్ధ నేపథ్యంలో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. నిఖిల్ యుద్ధం మధ్యలో కత్తి పట్టుకుని యోధుడిలా పవర్ ఫుల్ గా కనిపించారు. అతని పక్కన, సంయుక్త విల్లు బాణంతో నిలబడి టార్గెట్ ని చేరుకున్నట్లు కనిపించడం ఆకట్టుకుంది. ఈ పోస్టర్ సినిమా గ్రాండ్ స్కేల్ ని ప్రజెంట్ చేస్తోంది. బ్యాక్ డ్రాప్ లో సెంగోల్ చాలా ఆసక్తికరంగా వుంది.
సెంగోల్ శక్తి, ధర్మానికి చిహ్నం. ప్రాచీన రాజ్యాల నుండి భారతదేశ స్వాతంత్ర్యం వరకు, సెంగోల్ ఎంతో ప్రాముఖ్యత వుంది. మన ప్రాచీన చరిత్ర ప్రకారం, శ్రీ రాముడు సెంగోల్‌ను నీతిమంతమైన పాలనకు చిహ్నంగా అందుకున్నారు, ఇది న్యాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచింది.
ఇటీవల, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశ గొప్ప వారసత్వానికి నివాళులర్పిస్తూ కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ సీటు దగ్గర సెంగోల్‌ను ప్రతిష్టించారు.
ఇప్పుడు, స్వయంభు ఈ శక్తివంతమైన నేపథ్యాల చుట్టూ అద్భుతమైన కథతో వస్తోంది. రాబోయే టీజర్ ఈ ఎక్సయిటింగ్ వరల్డ్ ని మరింత రివిల్ చేయనుంది.
నభా నటేష్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్లు.
తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
డీవోపీ: KK సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







