'ఘాటి' జూలై 11న థియేట్రికల్ రిలీజ్
- June 02, 2025
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. దీని తర్వాత, తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని UV క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు.
ఈరోజు, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి.
'ఘాటి' అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ సక్సెస్ ఫుల్ మూవీ 'వేదం'తర్వాత కలిసిన చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. అనుష్క, UV క్రియేషన్స్‌తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి ఎడిటర్. సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. ఈ చిత్రం హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది.
ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: అనుష్క శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
ప్రెజెంట్స్: UV క్రియేషన్స్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
కథ: చింతకింది శ్రీనివాసరావు
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి
యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







