మరోసారి థియేటర్స్‌లోకి అందాల రాక్షసి..
- June 05, 2025
ఈ మధ్య టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది – రీ రిలీజ్‌లు. సినిమాలు ఓటీటీలో, ఫోన్లలో తక్షణమే లభించిపోతున్న కాలంలోనూ, పాత సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజ్ అవ్వడం, భారీగా ప్రేక్షకులను ఆకర్షించడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. టాలీవుడ్‌లో గతకొంత కాలంగా ప్రతి నెలా మూడు లేదా నాలుగు పాత సినిమాలు తిరిగి విడుదల అవుతూ, ఫ్యాన్స్‌కు పండగలా మారాయి. స్టార్ హీరోల బర్త్ డేలకు, స్పెషల్ డేలకు ఆ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.
క్లాసిక్ లవ్ స్టోరీ ‘అందాల రాక్షసి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు
2012లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అందాల రాక్షసి ఇప్పటికీ యూత్ హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ సినిమాతో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత మెల్లగా హిట్ టాక్ అందుకుంది.
రీ రిలీజ్ తేదీ
అందాల రాక్షసి సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాక్షసి సినిమా మరోసారి థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. జూన్ 13న అందాల రాక్షసి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ అందమైన ప్రేమకథను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ లో మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఇటీవల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల పాత సినిమాలు విడుదలై థియేటర్స్ లో మరోసారి దుమ్మురేపాయి. హిట్ అయినా సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







