గల్ఫ్ ఎయిర్ కు బాంబు బెదిరింపు..పోలీసుల అదుపులో నిందితుడు..!!
- June 09, 2025
దోహా, ఖతార్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్ - GF213 కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అనంతరం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేయగా, అది ఫేక్ అని తేలింది. ఈ తనిఖీ ఫోటోలను కువైట్‌లోని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) తన సోషల్ మీడియాలో పంచుకుంది.
"కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా విధానాలు, ప్రోటోకాల్‌ల ప్రకారం.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికారులతో పూర్తి సమన్వయంతో నివేదికను వెంటనే అందజేసారు." అని DGCA పేర్కొంది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, అటువంటి నివేదికలను ఎదుర్కోవడానికి ముందుగా ఏర్పాటు చేసిన అన్ని భద్రతా ప్రణాళికలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ బాంబు బెదిరింపునకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేశామని, అతనిపై భద్రతా చర్యలు తీసుకున్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారిక ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజి తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







