'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో జాయిన్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
- June 10, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల
సాంకేతిక సిబ్బంది:
రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
స్క్రీన్ ప్లే: కె దశరథ్
రచన సహకారం: సి చంద్ర మోహన్
సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
CEO: చెర్రీ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







