మహేష్–రాజమౌళి సినిమా..నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ఎక్కడంటే?
- June 14, 2025
మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్ అనౌన్స్ చేసినప్పట్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో పాన్ ఇండియా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగ్గా, రెండవ షెడ్యూల్ ఒడిశా అడవుల్లో జరిగింది. మూడో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో జరుగుతుంది. త్వరలో నాలుగో షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ ఆఫ్రికా ఖండానికి వెళ్లనున్నారు. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో రాజమౌళి స్వయంగా వెళ్లి ఎడారులు, అడవులు, జంతువులు ఉండే లొకేషన్స్ ని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి గతంలో స్వయంగా కెన్యా లొకేషన్స్ గురించి పోస్ట్ చేసారు.
సమ్మర్ లో అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుందని మార్చ్ లో జరగాల్సిన షెడ్యూల్ ని వాయిదా వేశారు. వచ్చే నెల జులైలో మహేష్ – రాజమౌళి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళ్లనున్నారు. అలాగే ఆఫ్రికాలోని వేరే దేశాల్లోని నేషనల్ వైల్డ్ పార్క్స్ లో కూడా షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం. కొన్ని యాక్షన్ సీన్స్ ని అక్కడ అడవుల్లో తెరకెక్కించనున్నారు.
ఇక రాజమౌళి – మహేష్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా తెలిపారు. ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని మొక్క గురించి వెతుకులాటతో ఈ సినిమా కథాంశం అని ఇటీవల ఓ రూమర్ బాగా వైరల్ అయింది. అది నిజమో కాదో తెలీదు గాని రాజమౌళి మాత్రం అడవులు, ఎడారులు తిప్పి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2027 లో రిలీజ్ అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







