విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ సినిమా
- June 17, 2025
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగ్నేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ ని విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.
ఈ సినిమాలోని కీలక నటీనటులను నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరిని అనౌన్స్ చేస్తున్నారు. టబు, దునియా విజయ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు, టాలీవుడ్ లక్కీ చార్మ్‌గా సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. సంయుక్త పాత్ర కథనంలో కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే పాత్రలో కనిపించబోతున్నారు. కథ, ఆమె పాత్రతో సంయుక్త చాలా థ్రిల్ అయ్యింది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆసక్తిగా వుంది.
ఫస్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్లను ఖరారు చేయడానికి టీం ఇటీవల హైదరాబాద్, చెన్నైలలో రెక్కీని పూర్తి చేసింది. జూన్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!









