'మారెమ్మ'- పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
- July 07, 2025
మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం ఇంపాక్ట్ ఫుల్ టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెండింటినీ రిలీజ్ చేశారు. ఇది పవర్ ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఉంటుందని హామీ ఇస్తోంది.
ఫస్ట్ లుక్ మాధవ్‌ను రూరల్ అవతార్‌లో పరిచయం చేస్తుంది. చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో, మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు. అతని చెదిరిన జుట్టు, గడ్డం ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం గా వున్నట్లు కనిపించారు. పోస్టర్, టైటిల్ అదిరిపోయాయి.
మాధవ్‌ను ఫెరోషియస్ రగ్గడ్ పాత్రలో ప్రజెంట్ చేయడానికి మంచాల నాగరాజ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రాశారు. మాధవ్ తన తొలి పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు.
వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయిక గా నటిస్తోంది.
ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: మాధవ్, దీపా బాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, V.S.రూపా లక్ష్మి
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: మోక్ష ఆర్ట్స్
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్
నిర్మాత: మయూర్ రెడ్డి బండారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్ విలాసాగరం
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి కందాలా
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: దేవ్ రాథోడ్
ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్ మురుగేషన్
యాక్షన్ డైరెక్టర్: మాడిగొండ నటరాజ్
కొరియోగ్రాఫర్: సాగ్గీ సాగర్
Vfx ప్రొడ్యూసర్: చంద్ర కాయల
డిజైనర్: సునందిని విజ్జగిరి
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్
స్టిల్స్ & మేకింగ్: శేఖర్ కథుల
పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







