‘VISA- వింటారా సరదాగా’ టీజర్..
- July 12, 2025
హీరో మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్. నూతన దర్శకుడు ఉద్భవ్ డైరెక్షన్లో ‘వీసా- వింటారా సరదాగా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణమే ఈ చిత్ర కథాంశంగా టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







