‘హరి హర వీరమల్లు' సెన్సార్ పూర్తి..
- July 15, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1–స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు.ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం గల్ఫ్ లో Phars Film Co. LLC ద్వారా విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం జులై 20న విశాఖపట్నంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కొంత భాగం దర్శకత్వం వహించగా, మిగతా పార్ట్ ను ఏ.ఎం జ్యోతికృష్ణ పూర్తిచేశారు. ఏ.ఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలతో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఒక పవర్ ఫుల్ సాంగ్ తో పాటు చిత్ర నిర్మాణ వీడియోను విడుదల చేయనున్నారు.ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం, కన్నులపండుగలా ఉంటుందని అంచనా.ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పని ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది.మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







