'కామాఖ్య' ఈ రోజు గ్రాండ్ గా లాంచ్
- July 27, 2025
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.
డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు.
ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్,వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తున్నారు. భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్.
ఈచిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్,వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య
కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
పీఆర్వో: వంశీ శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







