హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- September 19, 2025
హైదరాబాద్: గిన్నిస్ బుక్ రికార్డులో చేరేలా బతుకమ్మ సంబరాలు జరుపుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.గాంధీ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హనుమంతరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంసృతి అని బతుకమ్మ అంటే ప్రకృతి గౌరవించడం, ప్రకృతిని కాపాడటమని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పండుగలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తెలంగాణ సంసృతి ప్రపంచానికి చాటి చెప్పాలి మంత్రి పిలుపునిచ్చారు. 21నుండి31 వరకు బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుతామని వివరించారు. 21 న వెయ్యి సంభాల వద్ద ప్రారంభం చేయబోతున్నామని అన్నారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ పూల పండుగ మాత్రమే కాదు ఆడబిడ్డలను గౌరవించుకునే పండుగ అని తెలిపారు.
బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తుందని తెలిపారు. కవులను రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలకు ట్యూన్స్ కట్టించడంతోపాటు, ఆ పాటలను ముందు తరాలకు అందించేలా ముద్రణ చేయిస్తామని తెలిపారు.
బతుకమ్మ జరిగే ప్రాంతంలో డెకరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు విమానాశ్రయంలో కూడా మన సంసృతి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలి అని కోరుతున్నాను. వివిధ రుగ్మతలు పారదోలే విధంగా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.
బతుకమ్మ పండుగ ఉద్దేశం అందరూ కలిసి ఆత్మీయత కోసం ఇది వ్యక్తుల కార్యక్రమం కాదు అందరి పండుగ అని ఆయన తెలిపారు. మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ 30 ఏళ్లుగా బతుకమ్మ కుంటలో ఆడకుండా చేశారు గత ప్రభుత్వం హయంలో ఎంతోమందిని అడిగినా పట్టించుకోలేదని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కబ్జా చేశాడు కాంగ్రెస్ అధికారంలో రాగానే బతుకమ్మ కుంట చాలా బాగా చేసారు నేను సోనియా గాంధీకి ఇది మా సంసృతి అని కూడ బతుకమ్మ అని చెప్తే ఆమె కూడ బతుకమ్మ ఎత్తుకుందని గుర్తుచేసుకొన్నారు. బతుకమ్మ కుంటను కాపాడిన రేవంత్ రెడ్డికి, హైడ్రాకు నా అభినందనలు అని అన్నారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ కాంగ్రెస్ శ్రేణులు ఎంగిలి పువ్వు నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరారు. చాలా వరకు 2000 నుండి బతుకమ్మ ఏర్పాటు అయింది అపోహ ఉందని కానీ ఇది పాత పండుగనే అని ఆయన తెలిపారు.
కొందరు బతుకమ్మను రాజకీయం చేశారని అన్నారు. రకరకాల పాటలతో బతుకమ్మను ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు. ఇది తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టేపండుగ అని ఆయన అన్నారు. తెలంగాణ సంప్రదాయం, బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా జరుపుకోవాలి. బతుకమ్మ కుంట బతుకమ్మ కోసం మళ్ళీ వచ్చింది. బతుకమ్మ కుంటను కాపాడటంలో రేవంత్ రెడ్డి, హనుమంతు రావు పాత్ర కీలకమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









