'డ్యూడ్' నుంచి సెకండ్ గేర్ బాగుండు పో రిలీజ్
- September 21, 2025
వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు మేకర్స్ సెకండ్ గేర్ బాగుండు పో సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రదీప్ రంగనాథన్ తను ప్రేమించిన అమ్మాయి ఛాయిస్ ని రెస్పెక్ట్ చేస్తూ తన లవ్ ఫీలింగ్స్ ని ప్రజెంట్ చేసే ఈ సాంగ్ ని సాయి అభ్యాంకర్ హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు.
సంజిత్, సాయి అభ్యాంకర్ వోకల్స్ అద్భుతంగా వున్నాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం మనసుని హత్తుకునేలా వుంది. వినగానే కనెక్ట్ అయ్యే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్, లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్. భరత్ విక్రమన్ ఎడిటర్.
ఈ దీపావళికి డ్యూడ్ కలర్‌ఫుల్, మ్యూజిక్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.
తారాగణం: ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్, మమిత బైజు, రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: పూర్ణిమా రామస్వామి
ఎడిటర్: భరత్ విక్రమన్
తమిళ PRO: సురేష్ చంద్ర, సతీష్
తెలుగు PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?