రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
- October 07, 2025
యంగ్ హీరో రోషన్ తన లేటెస్ట్ ఫిల్మ్ ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను , జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛాంపియన్ ఫస్ట్ లుక్, ఆసక్తికరమైన టీజర్ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. “చాంపియన్” డిసెంబర్ 25న, క్రిస్మస్ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. పండుగ సీజన్, న్యూ ఇయర్ హాలిడేలలో వస్తున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ బిగ్ బూస్ట్ ఇవ్వనుంది.
రిలీజ్ పోస్టర్లో రోషన్ లాంగ్ డార్క్ ఓవర్‌కోట్, బెల్టెడ్ వెయిస్ట్‌తో క్లాసీ లుక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి బయటకు అడుగుపెడుతూ హీరోయిక్ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.
ఈ సినిమాలో రోషన్ ఇప్పటివరకు చేయని విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. పాత్రకు సరిపోయేలా ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా ఆర్. మధీ, మిక్కీ జే మేయర్ మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్‌కి తోట తరణి వంటి పెద్ద టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.
షూటింగ్ పూర్తి కాగానే సినిమా టీమ్ మ్యాసీవ్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
తారాగణం: రోషన్, అనశ్వర రాజన్
సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ బ్యానర్స్: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
DOP: ఆర్ మదీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







