SSC ప్రొడక్షన్ నంబర్ 3 అనౌన్స్మెంట్
- October 23, 2025
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రతి సినిమాతో ప్రేక్షలకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో క్రేజీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తుండగా హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు.
ఈ చిత్రం సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆమెకు బర్త్ డే విషెష్ అందిస్తూ ఒక స్పెషల్ వీడియోని రివిల్ చేశారు. ఈ వీడియో చాలా ఎంటర్టైనింగ్ గా వుంది.
ఈ చిత్రం ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగనుంది. ఈ క్రేజీ ఎంటర్టైనర్లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. తన సిగ్నేచర్ చార్మ్ తో అలరించనున్నారు.
ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. స్టార్ టెక్నిషియన్స్ ఈ సినిమాని పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం సమకూరుస్తారు. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
తారాగణం: శ్రీవిష్ణు, నయన్ సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
డీవోపీ: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







