#RT76- అన్నపూర్ణ స్టూడియోస్ లోని స్పెషల్ సెట్ లో రవితేజ
- November 03, 2025
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.
ఈ రోజు నుంచి హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది.ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన సెట్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.
ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ళ. నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: రవితేజ, ఆషికా రంగనాథ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







