సూర్య కొత్త సినిమా ప్రారంభం
- December 07, 2025
సూర్య కొత్త సినిమా ప్రారంభంతమిళ స్టార్ హీరో సూర్య ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే లక్ష్యంతో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ‘కంగువ’, ‘రెట్రో’ వంటి రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, తదుపరి చిత్రాలపై సూర్య ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే యాక్షన్ డ్రామా, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘Suriya 46’ అనే సినిమా సెట్స్‌పై ఉన్నాయి. వీటితో పాటు తాజాగా, తన 47వ చిత్రానికి పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వం వహించనున్నారు. ‘Suriya 47’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
‘Suriya 47’ చిత్రంపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొనడానికి ప్రధాన కారణం ఇందులో పాల్గొంటున్న క్రేజీ కాంబినేషన్. ఈ చిత్రంలో సూర్య సరసన టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించనుంది. ‘రాజా రాణి’తో యువ హృదయాలను కొల్లగొట్టి, ‘అంటే సుందరానికి’తో తెలుగులో నేరుగా ఎంట్రీ ఇచ్చిన నజ్రియాకు ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరితో పాటు, మలయాళంలో ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను అలరించిన యువ హీరో నస్లెన్ కె. గఫూర్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. జగరమ్ స్టూడియోస్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమా నిర్మాణంలో సూర్య, జీతూ మాధవన్ కూడా భాగం పంచుకుంటున్నారు. తెలుగులో బలమైన మార్కెట్ ఉన్న సూర్యకు, ఈ క్రేజీ కాంబో తప్పకుండా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న జీతూ మాధవన్ మలయాళంలో ‘రోమాంచమ్’, ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఇప్పుడు ‘Suriya 47’తో ఆయన కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం పవర్ఫుల్ పోలీస్ స్టోరీతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం. ఇక సాంకేతిక బృందం కూడా బలంగా ఉంది. మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అయిన సుశిన్ శ్యామ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. వినీత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఇప్పటికే ఇద్దరు అపజయాలు ఎదుర్కొన్న సూర్యకు, జీతూ మాధవన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్‌లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







