'ఛాంపియన్' ట్రైలర్ డిసెంబర్ 16న రిలీజ్
- December 15, 2025
ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ఛాంపియన్ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే విడుదలైన గిరిగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 16న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ అనౌన్స్ మెంట్ వీడియోలో రోషన్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అద్భుతమైన అల్బమ్ కంపోజ్ చేశారు. తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తారాగణం: రోషన్, అనస్వర రాజన్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి
సాంకేతిక బృందం:
బ్యానర్లు: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్
సమర్పణ: జీ స్టూడియోస్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
డిఓపి: ఆర్ మధీ
సంగీతం: మిక్కీ జె మేయర్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







