రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్..
- December 24, 2025
కమెడియన్ గా, విలన్ గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు దర్శకుడిగా కూడా మొదట్నుంచి కొత్త కొత్త కథలతో మెప్పిస్తున్నాడు. అల్లరి, అనసూయ, నచ్చావులే, నువ్విలా, అమరావతి, అవును, ఆవిరి, క్రష్.. లాంటి డిఫరెంట్ కాన్సెప్తులతో సినిమాలు ఈసీ హిట్స్ కొట్టి ప్రేక్షకులను మెప్పించాడు. డైరెక్టర్ గా కొంత గ్యాప్ తీసుకున్న రవిబాబు ఇటీవల మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితమే ఏనుగుతొండం ఘటికాచలం అనే సినిమాతో ఈటీవీ విన్ ఓటీటీలో పలకరించాడు రవిబాబు. తాజాగా రవిబాబు కొత్త సినిమాను ప్రకటిస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాడు. రవిబాబు కొత్త సినిమా పేరు ‘రేజర్’ అని ప్రకటించాడు. ఈ టైటిల్ గ్లింప్స్ లో మనుషులను ముక్కలు ముక్కలుగా నరికేసినట్టు చూపించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా రవిబాబే నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ రేజర్ సినిమాని సమ్మర్ 2026 లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు నెలకొల్పిన రవిబాబు సినిమా ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి. మీరు కూడా రవిబాబు కొత్త సినిమా రేజర్ టైటిల్ గ్లింప్స్ చూసేయండి..
తాజా వార్తలు
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..







