'నేను రెడీ' పాండిచ్చేరిలో సాంగ్ షూట్ పూర్తి
- December 25, 2025
'నువ్విలా', 'జీనియస్', 'రామ్ లీల', 'సెవెన్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో జతకట్టారు. 'సినిమా చూపిస్తా మామ', 'నేను లోకల్', 'ధమాకా', 'మజాకా' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన త్రినాధ రావు నక్కిన 'నేను రెడీ' చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
చిత్ర బృందం క్రిస్మస్ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో హవిష్ చాలా హుందాగా, అదే సమయంలో ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. చక్కగా దువ్విన జుట్టు, ట్రిమ్ చేసిన గడ్డం, నల్లటి అద్దాల కళ్ళజోడు అతనికి ఒక సీరియస్ లుక్ ఇచ్చాయి. ముదురు రంగు ప్యాంటులో ఇన్ చేసిన చెక్ షర్ట్, ఐడీ కార్డు, భుజంపై వేలాడుతున్న బ్రౌన్ కలర్ ఆఫీస్ బ్యాగ్‌తో అతని లుక్ మిడిల్ క్లాస్ మ్యాన్ లా వుంది. అతని నిలబడిన తీరు యాక్షన్ కి సిద్ధంగా ఉన్నట్లు వుంది.
నవ్వులు పూయించే వినోదాత్మక చిత్రాలను అందించడంలో పేరుగాంచిన దర్శకుడు త్రినాధ రావు నక్కిన, హవిష్‌ను మల్టీ లేయర్స్ వున్న హ్యుమర్ రోల్ లో చూపిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత, చిత్ర బృందం నిన్న పాండిచ్చేరిలో హీరో హీరోయిన్ల పై చిత్రీకరించిన సాంగ్ షూట్ పూర్తి చేసింది, ఈ పాటకు విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ అద్భుతంగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన 'నేను రెడీ' టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనను పొంది, సినిమాపై అంచనాలను పెంచింది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి పలువురు అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మెలొడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ విజువల్స్ అందిస్తున్నారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను విక్రాంత్ శ్రీనివాస్ అందించారు.
చిత్ర బృందం త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనుంది.
నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్

తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్‌లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!