‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది..
- January 04, 2026
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార, క్యాథరిన్ త్రెసా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ట్రైలర్ చూస్తుంటే చిరంజీవి వింటేజ్ కామెడీ బాగానే ఉన్నట్టు, భార్య భర్తల కామెడీ సీన్స్, మాస్ యాక్షన్ ఫైట్స్, చిరు – వెంకీ కాంబో అదిరిపోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ లోనే డైలాగ్స్ అదరగొట్టారు. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. పండక్కి మరోసారి అనిల్ రావిపూడి ఫ్యామిలీలకు దగ్గరయి హిట్ కొట్టడం గ్యారెంటీ.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







