రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- January 25, 2026
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.సైన్స్, వ్యవసాయం, కళలు, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ జాబితాలో పెద్దపీట వేశారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డి (పాడి, పశు సంవర్దక విభాగంలో సేవలు), సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (తమిళనాడు)ను జన్యసంబంధిత పరిశోధనలకు గానూ పద్మశ్రీ అవార్డులు వరించాయి.
సర్వత్రా హర్షం
అంకె గౌడ (సాహిత్యం- కర్ణాటక), భగవాన్ దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్), ఆర్మిడ్ ఫెర్నాండేజ్ (మహారాష్ట్ర), శ్యామ్ సుందర్, చిరంజిలాల్ యాదవ్ (ఉత్తర్ ప్రదేశ్), రఘుపతి సింగ్, బ్రిజ్‌లాల్ భట్ (జమ్మూ కశ్మీర్), రామచంద్ర, సీమాంచల్ పాత్రో, తేచీ గుబిన్, కేమ్ రాజ్ సుందర్, ఇంద్రజీత్ సింగ్, ఆర్.క్రిష్ణన్, షఫీ షౌక్, పున్‌మూర్తి కాటేసన్,పంజివేల్, కళ్లాష్ చంద్ర, భగవాన్ దాస్ రాయికర్, ఎస్. జే. సుశీలమ్మ, భికల్యా లడక్యా ధిండా, బుధ్రి తాటి (ఛత్తీస్‌గఢ్), చరన్ హెమాంబ్రమ్, ధర్మిక్లాల్ ఛునియలాల్ పాండ్య, గఫ్రూద్దీన్ మేవాత్ జోగి, హల్యా వార్, కైలాష్ చంద్ర పంత్, ఖేమ్ రాజ్ సుందర్యాల్, కొలక్యిల్ దేవకి అమ్మ, మహేంద్ర కుమార్ మిశ్రా,మిర్ హజ్‌బాయ్ కసంభాయ్, మోహన్ నగర్, నరేశ్ చంద్ర దేవ్ వర్మ, నిలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా, నూరుద్దీన్ అహ్మద్, ఒథువర్ తిరుత్తణి స్వామినాథన్, పద్మ గుర్మీత్, పోఖిలా లేక్తిపీ, రఘువీర్ తుకారామ్ ఖేడ్కర్ (మహారాష్ట్ర), రాజసత్పతి కలియప్ప గౌండర్, రామచంద్ర గోడ్బెల్-సునీత్ గోడ్బెల్, సంగ్‌యుసంగ్ ఎస్ పొంగేనేర్, షఫీ షౌక్, శ్రీరంగ దేవబ లాడ్, సురేశ్ హనంగ్‌వడి, తాగా రామ్ భీమ్, తైచీ గుబిన్, తిరువరూర్ భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జత్రా సింగ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్‌లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్‌లు ప్రారంభం..
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!







