మోహన్‌లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ అనౌన్స్మెంట్
- January 27, 2026
మోహన్‌లాల్ కథానాయకుడిగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మాత గోకులం గోపాలన్ నిర్మిస్తున్న కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తన తొలి చిత్రం ‘మెప్పాడియన్’తో బలమైన ముద్ర వేసిన విష్ణు మోహన్ ఈ చిత్రానికి కథ అందించి దర్శకత్వం వహించనున్నారు. భారీ స్థాయిలో నిర్మితమవుతున్న L367, శ్రీ గోకులం మూవీస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీ. ఈ ప్రాజెక్ట్‌కు బైజు గోపాలన్, వి సి ప్రవీణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించనుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భారీ కాన్వాస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫారిన్, బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయనున్నారు. చిత్ర బృందం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు
ప్రస్తుతం శ్రీ గోకులం మూవీస్ నిర్మాణంలో సురేష్ గోపి నటించిన ఒట్టకొంబన్, జయరామ్-కాళిదాస్ జయరామ్ ఆశకల్ ఆయిరం, జయసూర్య నటించిన కథనార్, నివిన్ పౌలీ-బి ఉన్నికృష్ణన్ చిత్రం, ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన కిల్లర్ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ జాబితాలో L367 కూడా చేరడంతో ఈ బ్యానర్ మలయాళ సినిమా రంగంలో ఒక శక్తివంతమైన నిర్మాణ సంస్థగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







