అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- February 06, 2026
అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో యువ భారత్ దుమ్మురేపింది. 6వ సారి ప్రపంచ విజేతగా నిలిచింది. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి జగజ్జేతగా నిలిచింది. వరుస విజయాలతో ఫైనల్ కి చేరిన భారత్.. తుది పోరులోనూ విజయదుందుభి మోగించింది.
తుది పోరులో యంగ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు నమోదు చేసింది. 412 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 311 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరోసారి అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా నిలిచి యువ భారత్ రికార్డ్ నెలకొల్పింది. అండర్-19 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను 6వసారి కైవసం చేసుకుంది.
భారత బౌలర్లలో అంబరీశ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటు. దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పటేల్, ఆయుష్ మాత్రే చెరో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఫైనల్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సూపర్ సెంచరీ బాదాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏకంగా 15 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయంటే… ఏ రేంజ్ లో బాదాడో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ మాత్రే ఆఫ్ సెంచరీతో మెరిశాడు. 51 బంతుల్లో 53 రన్స్ చేశాడు.
కుందు (40), కనిష్క్(37 నాటౌట్), త్రివేది (32), మల్హోత్రా (30) రాణించారు. భారత్ ఇన్నింగ్స్ లో ఏకంగా 19 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో మింటో 3 వికెట్లు తీశాడు. మోర్గాన్, గ్రీన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. 55 బంతుల్లోనే శతకం బాదాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక, ఈ మెగా టోర్నీ ఫైనల్లో సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ గా వైభవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







