UTS యాప్‌ సేవలు బంద్..

- February 07, 2026 , by Maagulf
UTS యాప్‌ సేవలు బంద్..

న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే మంత్రిత్వ శాఖ మార్చి 1 నుంచి UTS (Unreserved Ticketing System) మొబైల్ యాప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. 2014 డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు అన్‌రిజర్వ్ టిక్కెట్లు, సీజన్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. దాదాపు దశాబ్ద కాలంగా లక్షలాది మంది ప్రయాణికులు ఈ యాప్‌ను వినియోగించారు. అయితే ఇప్పుడు ఈ యాప్ క్లోజ్ చేస్తున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ) దిలీప్ కుమార్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం ప్రారంభించిన కొత్త సూపర్ యాప్ RailOne మరింత యూజర్-ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా.. UTS యాప్‌లో ఉన్న అన్ని ముఖ్య ఫీచర్లను కూడా కలిగి ఉందని తెలిపారు. రైల్వే ప్రయాణికులు కొత్త యాప్ కి మారాలని సూచించారు.

RailOne యాప్‌ను భారతీయ రైల్వేలు వన్-స్టాప్ డిజిటల్ సొల్యూషన్ గా రూపొందించాయి. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వ్ టిక్కెట్లు, అన్‌రిజర్వ్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను ఒకే యాప్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న వంటి సేవలను ఒకే ఇంటర్‌ఫేస్‌లో అనుసంధానం చేశారు. జనవరి 2026 నుంచి రైల్వేలు RailOne యాప్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ప్రకటించాయి. డిజిటల్ టికెటింగ్‌ను మరింత విస్తరించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. RailOne యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ తగ్గింపు UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి అన్ని డిజిటల్ చెల్లింపు పద్ధతులపై వర్తిస్తుంది.

RailOne యాప్ ముఖ్య ఫీచర్లు

  • ఒకే యాప్‌లో రిజర్వ్, అన్‌రిజర్వ్ మరియు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల బుకింగ్
  • UPI, కార్డులు, R-వాలెట్, నెట్ బ్యాంకింగ్ వంటి సురక్షిత చెల్లింపు ఎంపికలు
  • లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్, ఆలస్య సమాచారం, రియల్ టైమ్ కోచ్ & ప్లాట్‌ఫామ్ వివరాలు
  • PNR స్టేటస్ ట్రాకింగ్, రద్దులు మరియు రీఫండ్ స్థితి పర్యవేక్షణ
  • IRCTC-ఆమోదిత విక్రేతల ద్వారా సీటుకు నేరుగా భోజనం ఆర్డర్ చేసే సౌకర్యం
  • Rail Madad ద్వారా ఫిర్యాదులు, సేవా అభ్యర్థనలు, అభిప్రాయాల నమోదు

UTS యాప్‌ను నిలిపివేసి RailOne యాప్‌ను తీసుకురావడం ద్వారా.. భారతీయ రైల్వేలు డిజిటల్ సేవలను ఏకీకృతం చేసి ప్రయాణికులకు సులభమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మార్చి 1 తర్వాత రైలు ప్రయాణికులు తప్పనిసరిగా RailOne యాప్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com