ఈరోజే జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డా : చిరంజీవి
- February 11, 2026
తన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణంలోని అమూల్యమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’. ఈ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు మెగాస్టార్.
ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.
ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.
ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్లు పడ్డాయి.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







