నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- February 13, 2026
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అబ్షర్ ప్లాట్ఫామ్లో నాలుగు కొత్త ఇ-సేవలను పాస్‌పోర్ట్‌ల యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ సలేహ్ అల్-మురబ్బా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇక కొత్త సేవల్లో ప్రవాసుల ఫోటోను అప్డేట్ చేసుకోవడం, డిపెడెంట్ వాణిజ్య రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, డిపెడెంట్ సెఫరేట్ సర్వీస్ మరియు సల్వా సరిహద్దు క్రాసింగ్ వద్ద అబ్షర్ ట్రావెల్ సర్వీస్ ఉన్నాయి. కొత్త సర్వీసులు సమయాన్ని ఆదా చేస్తాయని, అదే సమయంలో పాస్‌పోర్ట్ సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని మేజర్ జనరల్ అల్-మురబ్బా అన్నారు. స్మార్ట్ పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్ లావాదేవీలను డెవలప్ చేయడంలో ఈ సేవలు భాగమని, లబ్ధిదారులకు అందించే సేవల నాణ్యతను పెంచడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







