రోషన్ కొత్త సినిమా ‘ఏమో ఏమో ఇది’..
- February 14, 2026
ఛాంపియన్ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో రోషన్ మేక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే ‘ఏమో ఏమో ఇది(Emo Emo Idi)’. హిట్ సిరీస్ చిత్రాలతో సాలిడ్ హిట్స్ అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కన్నప్ప ఫేమ్ ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్బంగా ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక టీజర్ హేషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంది. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా దసరా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. శైలేష్ తన థ్రిల్లర్ జానర్ ను పక్కన పెట్టి లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నాడు. మరి ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అనేది చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







